దాగుడు మూతలు…. ఆడతున్న హరీష్‌

246
Harish Shankar's next is a multistarrer
- Advertisement -

‘దువ్వాడ జగన్నాథమ్’ తో మంచి విజయాన్ని అందుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిన దర్శకుడు హరీష్ శంకర్. డీజే ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి సినిమాని కొంచెం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ కు ఆదరణ పెరిగిన నైపథ్యంలో హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్టుకు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు.డీజే సినిమాను నిర్మించిన దిల్ రాజునే ఈ సినిమాను కూడా నిర్మించనున్నాడు.

ఈ సినిమాలో ఇద్దరు యువ హీరోలు నటిస్తారట. బలమైన భావోద్వేగాలతో కూడి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ చిత్రానికి ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ ను కూడా నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.

Harish Shankar's next is a multistarrer
సినిమా కోసం అమెరికాలో లొకేషన్లు కూడా ఫైనలైజ్ చేశాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో వున్న ఈ సినిమాకు ఇంకా నటీనటుల ఎంపిక పూర్తికాలేదు. కాకపోతే ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా వున్న ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు ఇందులో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరనే వివరాల్ని మాత్రం హరీష్ శంకర్ గోప్యంగానే దాచిపెట్టారు.

- Advertisement -