సఫారీ గడ్డపై కోహ్లీ సేన సిరీస్‌ నెగ్గేనా!

80
virat

దక్షిణాఫ్రికాతో ఇవాళ మూడో టెస్టులో తలపడనుంది భారత్. కేప్ టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా అందరి కళ్లు విరాట్ కోహ్లీ సేనపైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ నెగ్గుతుందా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ ఈ టెస్టులో ఆడనుండటం టీమిండియాకు కలిసివచ్చే అవకాశం కాగా జట్టులో పలు మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ గెలవని భారత్‌కు ఇదే చక్కటి అవకాశం.

భారత్‌ జట్టు అంచనా: కేఎల్ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్, చతేశ్వర్ పుజార, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రహానె, రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ పటేల్‌, అశ్విన్‌, షమి, బుమ్రా, ఇషాంత్‌.

దక్షిణాఫ్రికా జట్టు అంచనా: ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, పీటర్సన్‌, డుస్సెన్‌, బవుమా, వెర్రెనీ, జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, రబాడ, ఒలివియెర్‌, ఎన్‌గిడి.