గోవాలో బీజేపీకి మరో షాక్‌..సీనియర్ మంత్రి రాజీనామా

22
goa

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా తాజాగా అధికార బీజేపీ పార్టీ మంత్రి,సీనియర్ ఎమ్మెల్యే మైఖేల్‌ లోబో బీజేపీకి షాకిచ్చారు. తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మైఖేల్‌, నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖకు మంత్రిగా పనిచేశారు. మైఖేల్ అనూహ్యంగా పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. ఆచన బాటలోనే మరో ఎమ్మెల్యే ప్రవీణ్‌ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు..

త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ ప్రజల పక్షాన నిలవలేదని…నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.