Ind Vs Aus T20:థ్రిల్లింగ్ విక్టరీ..సిరీస్ కైవసం!

45
- Advertisement -

టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో నిన్న జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో సిరీస్ టీమిండియా సొంతమైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. గత నాలుగు మ్యాచ్ లలో చెలరేగి ఆడుతున్న ఓపెనర్లు యశస్వి (21), రుతురాజ్ గైక్వాడ్ (10), చివరి మ్యాచ్ లో మాత్రం నిరాశపరిచారు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6), జితేష్ శర్మ (31) వంటి వారు కూడా తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యారు..

కానీ చివరి మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ (53) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆ తర్వాత లక్ష్య చేధన కు దిగిన ఆసీస్ 154 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో భారత్ కు 6 పరుగుల తేడాతో విజయం లభించింది. వరల్డ్ కప్ ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓటమిపాలు అయి అడుగు దూరంలో కప్పు చేజార్చుకున్న టీమిండియా ఆ తరువాత జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకొని కొంత ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ నెల 10న సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ను మొదలు పెట్టనుంది టీమిండియా. సఫారీలతో మూడు టీ20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు అడనుంది మరి సఫారిల గడ్డపై టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

Also Read:బీజేపీ గెలిచిన 8 స్థానాలివే..

- Advertisement -