ఆసీస్‌తో రెండో వన్డే…గెలిస్తేనే సిరీస్‌ ఆశలు సజీవం

349
finch
- Advertisement -

ఆసీస్‌తో రెండో వన్డేలో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా తొలివన్డే ఓటమితో ఒత్తిడిలో కూరుకుపోయింది భారత్. గత మ్యాచ్‌లాగే పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుండగా బ్యాట్స్‌మెన్‌ నిలబడితే చాలు… భారీస్కోర్లు రిపీట్‌ అవుతాయి.

సిరీస్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వరుస విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌… ఆల్‌రౌండ్‌ సత్తాతో పర్యాటక జట్టును మళ్లీ కంగారు పట్టించేందుకు సిద్ధమైంది.

రెండో వన్డేలో కెప్టెన్ కోహ్లీ రాణిస్తే భారత్ గెలుపు ఖాయమే. ఓపెనర్లు ఫామ్‌లో ఉండటం, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ బ్యాట్‌కు పనిచెబితే పరుగుల వరద పారుతుంది. హార్దిక్‌ పాండ్యా చాలా రోజుల తర్వాత వన్డే ఆడినా…భారీ స్కోరు సాధించాడు. ఇది జట్టుకు సానుకూలాంశం. మొత్తంగా రెండో వన్డేలో భారత్ గెలిస్తేనే సిరీస్ దక్కుతుంది.

India XI: S Dhawan, M Agarwal, V Kohli, S Iyer, KL Rahul, H Pandya, R Jadeja, M Shami, Y Chahal, N Saini, J Bumrah

Australia XI: A Finch, D Warner, S Smith, M Labuschagne, M Henriques, G Maxwell, A Carey, P Cummins, M Starc, A Zampa, J Hazlewood

- Advertisement -