భారతదేశంకు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైంది. కానీ భారతదేశంకు 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు వస్తే… అందులో మొదటి ఓటరుగా నమోదైన వ్యక్తి శ్యామ్ శరణ్ నేగీ. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నేగీ(106) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మృతిచెందినట్టు నేగీ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కిన్నౌర్‌కు చెందిన నేగీ 1917 జులై 1న జన్మించిన నేగీ…. స్కూల్ టీచర్‌గా పనిచేశారు. వందేళ్లు దాటినా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మరీ ఓటు వేసి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. మూడురోజుల క్రితమే ఆయన రాబోయే శాసనసభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా…ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. దీంతో నవంబరు 2న నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో నేగీ ఓటు వేయడం ఇది 34వ సారి ఆయన అనారోగ్యం దృష్ట్యా అధికారులే ఆయన ఇంటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.
నేగీ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. నేగీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నేగీ మృతి పట్ల కేంద్ర ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి..