ఈ నెల 6 వరకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

134
rains
rains
- Advertisement -

రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

బుధవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 4న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.

5న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో, 6న పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా మంచిర్యాల, జయశంకర్‌, జనగామ, సిద్ధిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, నల్గొండ తదితర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి.

- Advertisement -