ఆసియా కప్‌లో దాయాదుల సమరం ఎప్పుడో తెలుసా…

101
cup
- Advertisement -

దేశ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌ వచ్చేసింది. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఈనెల (ఆగస్ట్‌) 27 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దుబాయ్‌ వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్‌-పాక్‌) ఆగస్ట్‌ 28న జరుగనుంది. షెడ్యూల్‌ పూర్తి వివరాలను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా ట్విటర్‌ వేదికగా మంగళవారం ప్రకటించారు.

- Advertisement -