సినిమా ఇండస్టీలో హీరోయిన్లు ఎలాంటి వేధింపులను ఫేస్ చేస్తారో రోజురోజుకూ బయటపడుతూనే ఉంది. హీరొయిన్ భావన ఉదంతం తర్వాత ఒక్కో హీరోయిన్ వారు ఎదురుకున్న వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. అయితే ఇలాంటి వేధింపులను తాను కూడా ఎదుర్కొన్నానంటోంది ఇలియాన.
“కథానాయికలను తెరవెనక దారుణంగా వేధిస్తారు. నా కెరీర్ ఆరంభంలో కొందరు సినీపెద్దలు లైంగికంగా వశపరుచుకునేందుకు తెగబడ్డారు” అంటూ పెద్ద బాంబ్ పేల్చింది ఇల్లి. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది లైంగిక వేధింపులకు గురౌతున్నారని చెప్పుకొచ్చింది.
అయితే ఎంతో ప్రొటెక్షన్ ఉండే ఇలియానానే అంతలా వేధించారంటే ఇక మధ్యతరగతి అమ్మాయిల్ని ఇంకెంత దారుణంగా వేదిస్తారో అర్థం చేసుకోవచ్చు అంటూ ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం కథానాయికలు ఎదుర్కొంటున్న పరిణామాలను చూస్తే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది ఇలియాన.
తన జీవితంలో ఓ అరుదైన సందర్భం గురించి చెప్తూ.. “సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేస్తున్న రోజుల్లో ఒక అబ్బాయి నన్ను నిత్యం అనుసరించేవాడు. నాతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. చాలా ఇబ్బందిగా ఫీలయ్యేదాన్ని. నా బాధ అమ్మ తెలుసుకుని అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నెక్ట్స్ డే నుంచి ఆ కుర్రాడు కనిపించలేదు” అంటూ చెప్పింది.
ఇలా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతులన్నీ చెప్పేసింది ఇలియాన. అయితే…తన అనుభవాలు విన్న తర్వాత ఇంతకీ ఇలియానాని లైంగికంగా వేధించిన ఆ సిని పెద్దలు ఎవరు అంటూ ఫిలింనగర్‌లో చర్చ మొదలైంది. అంతేకాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలోనూ హాట్ హాట్‌గా ఈ విషయం గురించే ముచ్చటించుకుంటున్నారు.