పూరికే దిమ్మతిరిగిపోయింది…

173
puri jagannadh new movie rogue censor

పూరి సినిమా వస్తుందంటే చాలు యూత్ కి నిద్రపట్టదు. పూరి మూవీ యూత్ కి మాంచి ఎనర్జీనిచ్చే ఓ హాట్‌ డ్రింక్‌ లాంటిది. ఎందుకంటే పూరి సినిమాలో యూత్‌ కి కావాల్సినంత మసాలా ఉంటుంది. ఆ హాట్‌ మసాలాలతో యూత్‌ ఫిదా అయిపోతే..దాన్నే లీడ్‌గా తీసుకొని  సినిమాలు కానిచ్చేస్తుంటాడు పూరి. అయితే పూరిజగన్నాథ్‌ తాజా సినిమా ‘రోగ్‌’ లో కూడా యూత్‌ కి పిచ్చెక్కించే సీన్స్ చాలానే ఉన్నాయట.
puri jagannadh new movie rogue censor
ఓ ప్రక్క హాట్ బ్యూటి మన్నారా చోప్రా..మరో ప్రక్కన ఏంజెలా క్రిసిలింజికి.. వీరిద్దరికి తోడు పూరి జగన్నాథ్. ఇంకేముంది పూరి వారి  గ్లామర్ ను దన్నుకోవడంలో కింగ్ లాంటోడు. అందుకే ఈ ఇద్దరి గ్లామర్‌ ని వాడుకోవడంలో పూరి రెచ్చిపోయాడు. పూరి మాత్రమేనా… పూరి సైగలతో ”రోగ్” సినిమాలో ఈ భామలిద్దరూ కూడా రచ్చ చేసిపాడేశారు. ఇద్దరూ పోటీ పోటీగా గ్లామర్ ఆరబోయగా.. ఇద్దరూ కూడా లిప్ లాకుల్లో ప్రొఫెషనలిజం చూపించేశారు.

అయితే కొత్త కుర్రాడు ఇషాన్ తో వీరు కానిచ్చిన ముద్దుల సునామీని.. ఆల్రెడీ టీజర్లలో మనం చూసేశాం కూడా. అయితే ఇప్పుడు ఈ ముద్దుల సునామీకి సెన్సార్‌ బోర్డు చెక్‌ పెట్టేసింది. దీంతో పూరికి అసలుసిసలైన స్ర్టోక్ తగిలినట్టైంది. ‘రోగ్‌’ లో పెదాలుకొరికే సీన్ లను తీసేయమందట సెన్సార్‌ బోర్డు. మామూలుగా లిప్ కిస్సులు వేరేలా ఉంటాయ్ కాని.. ఇక్కడ మాత్రం కాస్త ఘాడంగా ఫ్రెంచ్ కిస్సింగ్ లా ఉన్నాయట. అందుకే సెన్సార్ వారు అబ్జెక్షన్ చెప్పినట్లు తెలుస్తోంది.
puri jagannadh new movie rogue censor
ఇక మార్చి 31న రోగ్ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోగ్‌ లో ఆ సీన్లను తీసేసినంత మాత్రాన సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆ ముద్దులతో కావాల్సినంత హైప్ వచ్చేసింది. సో నో టెన్షన్‌ అనే చెప్పాలి.

పూరితో హీరోగా ఇంట్రడ్యూస్‌.. హ్యాపీగా వుంది

‘రోగ్‌’ క్యూట్ ల‌వ్ స్టోరీ…