AM గ్రీన్ ఇండియా గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (IGPL) 10 ఫ్రాంచైజీల పూర్తి జట్లను ప్రకటించింది. ఈ జట్ల ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ గోల్ఫర్లు ఈ లీగ్‌లో భాగమవుతున్నారు. క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్, ఐజీపీఎల్ సీఈవో ఉత్తమ్ సింగ్ ఈ జట్లను ప్రకటించారు.
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ…గోల్ఫ్ సాధారణంగా వ్యక్తిగత ఆట అయినప్పటికీ, జట్టు ఫార్మాట్‌తో ఆట మరింత ఆసక్తికరంగా మారుతుందని అన్నారు.కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..గోల్ఫ్ ప్రీమియర్ లీగ్‌పై ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధికి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించడం గొప్ప నిర్ణయం అని చెప్పారు. ఇది “బ్రాండ్ ఇండియా”కు బలాన్ని చేకూర్చే చర్యగా అభివర్ణించారు.
మొత్తం 15 ఈవెంట్లు నిర్వహిస్తారు.10 ఈవెంట్లు భారత్‌లో,5 అంతర్జాతీయ ఈవెంట్లు ఉండనున్నాయి. ప్రతి జట్టులో 4 మంది ఆటగాళ్లు ఉంటారు.ప్రతి ఈవెంట్‌లో వ్యక్తిగతంగా రూ.1.5 కోట్ల బహుమతి ఉంటుంది.
ప్రతి జట్టులో రోజుకు అత్యుత్తమ 2 స్కోర్లు మాత్రమే జట్టు స్కోర్‌గా పరిగణిస్తారు.సీజన్ మొత్తం పాయింట్లు సమీకరించి చివర్లో టాప్ 3 జట్లను ఎంపిక చేస్తారు.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!
Atri Mumbai GC: అమన్ రాజ్, ఉదయన్ మానే, ఆదిల్ బేడి, తుషార్ పన్ను
Auro Realty Goa GC: వరుణ్ చోప్రా, సార్థక్ చిబ్బర్, ఆలాప్ I L, కనవ్ చౌహాన్
Flying Man Kolkata GC: వరుణ్ పారిఖ్, సుఖ్‌మన్ సింగ్, సయ్యద్ సాఖిబ్ అహ్మద్, కార్తిక్ శర్మ
Green Fuels Vizag GC: మనవ్ షా, ధర్మ ఎం, మిలింద్ సోని, డానిష్ వర్మ
Golf Konnekt Bengaluru: వీర్ గణపతి, సున్హిత్ బిష్ణోయ్, త్రిశూల్ చిన్నప్ప, సుధీర్ శర్మ
Honer Homes Gurugram GC: పుఖ్రాజ్ సింగ్ గిల్, శౌర్య బిను, శాత్ మిశ్రా, దిగ్రాజ్ సింగ్ గిల్
Krishna Punjab GC: కరణదీప్ సింగ్ కొచ్చర్, కపిల్ కుమార్, హరేంద్ర గుప్తా, సి మునియప్ప
Phoenix Hyderabad GC: సచిన్ బైసోయా, రాఘవ్ చుగ్, అర్జున్ భట్టి, రంజిత్ సింగ్
RVR Delhi GC: శివ్ కపూర్, ఆర్యన్ రూపా ఆనంద్, చిరాగ్ కుమార్, గౌరవ్ ఘే
Vimtra Chennai GC: గగన్‌జీత్ భుల్లర్, యశాస్ చంద్ర MS, సమర్థ్ ద్వివేది, హర్షజీత్ సింగ్ సెథీ

