సైలెంట్‌గా ఉన్నానంటే..ఓడిపోయానని కాదు!

10
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తర్వాత, ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. నా గొంతును మూయించవచ్చు కానీ ఓడించలేరు అంటూ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆప్‌.. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించింది. దీంతో పాటు, ఆయనకు సభలో మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వవద్దని రాజ్యసభ కార్యదర్శిని కోరినట్లు సమాచారం.

దీనిపై స్పందించిన రాఘవ్.. ప్రజల సమస్యలు చెప్పడం తప్పేనా?, నాకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా, నేను ప్రజల సమస్యలనే లేవనెత్తాను. ఎవరూ మాట్లాడడానికి ధైర్యం చేయని విషయాలపై మాట్లాడాను అనిచెప్పారు.

ప్రజల కోసం మాట్లాడడం తప్పా? నేను ఏమైనా తప్పు చేశానా? నేను ఏదైనా నేరం చేశానా? అని ప్రశ్నించారు. చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిత్తల్‌ను డిప్యూటీ లీడర్‌గా ప్రతిపాదించింది. ఈ నిర్ణయం పార్టీ అంతర్గత పరిణామాల్లో పెద్ద మలుపుగా భావిస్తున్నారు.

రాఘవ్ చద్దా… కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. దేశంలోనే యువ ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన, ముఖ్యంగా ఢిల్లీ మరియు పంజాబ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనతో ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే చర్చలు మొదలయ్యాయి.

 

Also Read:‘గాయపడ సింహం..’బ్రైడ్ సాంగ్’

- Advertisement -