బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..

468
- Advertisement -

మనిషికి కావాల్సింది దొరికితే బద్ధకం అనేది ఫ్రీగా వస్తుంది. కావున బద్ధకంను ఏవిధంగా పోగోట్టుకోవాలి..అసలు ఎందుకు పోగోట్టుకోవాలి అంటే మన కోసం మాత్రమే. ఈ జాగ్రత్తలు పాటించండి.

బద్ధకం పోవాలంటే ఈ చిట్కాలు…

1 ఉదయం లేవగానే ఠంచనుగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.అది మీ బద్ధకాన్ని పోగొట్టి శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. రోజంతా హుషార్‌గా ఉంటుంది.

2 బోలెడంత పని కళ్ల ముందు కనిపిస్తున్నా కొన్నిసార్లు దాన్ని పూర్తి చేయాలనిపించదు. కావున అలా వదిలేస్తే పని మరింతగా పేరుకుపోతుంది. కాబట్టి పనిని విభజించుకుని దశల వారీగా పూర్తి చేసుకోవాలి. లేదంటే పని కంటే బద్ధకం మరింత పెరుగుతుంది.

3 అన్ని పనులూ ఒకేసారి ముందేసుకుని కూర్చోడం వల్ల ఏ పనీ చేయలేం.కాబట్టి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసుకోవాలి. లేదంటే పనులను పూర్తిచేయడంలో తికమక పక్కా.

4 ఒక పని మొదలు పెట్టెముందు ఆ పని వల్ల కలిగే ప్రయోజనాలు దాని ద్వారా సాధించే లక్ష్యాల గురించి తెలుసుకొని వాటిని ముందుగా మొదలుపెట్టాలి లేదంటే అనవసరమైంది ముంది జరిగి అవసరమైన పని మెల్లగా జరగడం వల్ల తీరని నష్టం జరిగినట్టే.

5 రేపటి పనులను ఈ రోజు నుంచి ఆలోచించుకోవాలి లేదంటే సమయాన్నికి గందరగోళ పరిస్థితి ఉండదు.

6 ఈ రోజు ముగించే పనిని…రేపటికి వాయిదా వేయకూడదు. లేదంటే రేపటి పని ఎల్లుండికి వాయిదా వేయాల్సి వస్తోంది. కాబట్టి వాయిదాల పర్వం ముగించండి.

Also Read: నిమ్మకాయ ఎక్కువగా తింటే ప్రమాదమా?

7 ఒక పెద్ద ప్రాజెక్ట్‌ ను సకాలంలో పూర్తి చేస్తే తనకు తానే బహుమతి ఇచ్చుకొవాలి ఎందుకంటే పని సకాలంలో పూర్తి చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోతుంది.

8 కేవలం పని వల్ల బద్దకం వస్తుందంటే పోరపాటే. దానికి తగిన ఆహారం శరీరంకు కావాల్సిందే. లేదంటే అలసిపోవడం, శక్తి లేకపోవడం వల్ల బద్ధకం వస్తుంది. కనీసం రోజుకు 7-8గంటల నిద్ర తప్పనిసరి.

9 సోమరితనం వల్ల ఏవిధంగా నష్టపోతున్నామో తెలుసుకొని కాగితంపై రాసుకోవాలి. అప్పుడే కదా మీలో మార్పు వస్తుందో లేదో తెలుస్తుంది.

Also Read: రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసిన కోకా కోల

- Advertisement -