టమాటా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనం ప్రతిరోజూ ఉపయోగించే కూరగాయలలో ఒకటి. వంటల్లో ఏ కూర చేసిన అందులో టమాటా కచ్చితంగా ఉండాల్సిందే. టమాటా లేని కూరను ఊహించుకోవడం కష్టం. వంటల రుచిని పెంచడంలో టమాటా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా టమాటాతోనే కర్రీ, సాంబార్, చట్నీ, సాస్.. ఎలా ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. అయితే టమాటా తినడం వల్ల ఏం జరుగుతుంది. మన శరీరానికి కలిగే లాభాలు ఏంటి ? నష్టాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు.
టమాటా ఎన్నో పోషకాల సమ్మేళనం విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, వంటివాటితో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే పోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో టమాటోలు ఎంతగానో ఉపయోగ పడతాయి. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు టమాటాలు ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో తరచూ ఎదుర్కొనే డీహైడ్రేషన్ ను తగ్గించడంలో కూడా టమాటాలో ఉండే విటమిన్ కె, విటమిన్ సి వంటివి ఎంతో ఉపయోగపడతాయని అద్యయానాలు చెబుతున్నాయి.
Also Read: సిక్కు అధ్యాత్మిక గురువు ఇక్బాల్ సింగ్ పుట్టిన రోజు
ఇంకా మతిమరుపు, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా టమాటో కూరలు ఎక్కువగా తింటే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారట. ఇంక టమాటాలో ఉండే కెరోటిన్, లైకోఫీన్.. కంటిసమస్యలను తగ్గించి కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఇక చర్మాన్ని కోమలంగా చేయడంలోనూ, కాంతివంతంగా ఉంచడంలోనూ టమాటో ఎంతో ఉపయోగపడుతుంది. టమాటాలో ఉండే క్యాల్షియమ్, మెగ్నీషియం ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. ఇక అన్నిటికి మించి టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా గుండె సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. నేటి రోజుల్లో హార్ట్ ఎటాక్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిరోజూ మనం తినే ఆహారంలో టమాటో ఉండాలా చూసుకుంటే.. గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం..