ఆ పార్టీలు అధికారంలోకి వస్తే కోతలే!

24
- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత గత తొమ్మిదేళ్ల నుంచి రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లోనూ అగ్రపథంలో నడిపిస్తున్నారు బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా సంక్షేమం అభివృద్దిని సమపాళ్ళలో నడిపిస్తూ తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారు. గతంలో కరెంట్ విషయంలో రాష్ట్రం ఎదుర్కొన్నా ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఆ ఇబ్బంది లన్నిటిని దూరం చేస్తూ దేశంలో ఎక్కడ అమలు కానీ 24 ఉచిత కరెంట్ ను ఒక్క తెలంగాణలోనే సాధ్యం చేసి చూపించారు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. ఇక రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు మరే ఇతర రాష్ట్రంలో కూడా అమలుకు నోచుకోవడం లేదు. .

భూ రిజిస్ట్రేషన్ లలో అవకతవకలకు చోటివ్వకుండా ధరణి పోర్టల్ ను ప్రారంభించి సరికొత్త ఒరవడి సృష్టించారు. ఇలా కే‌సి‌ఆర్ అమలు చేసిన ప్రతిదీ ప్రజాశ్రేయస్సులో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి అమలు అలాగే కొనసాగాలి అంటే ఈసారి ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ గెలవడం అనివార్యం. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలు వీటి అమలు విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ అమలులో మార్పులు ఉంటాయని కాంగ్రెస్ ఇప్పటికే తెలియజేసింది.

అలాగే ధరణి రద్దు చేస్తామని చెబుతూ వాటి అమలు కాంగ్రెస్ కు సాధ్యం కాదని పరోక్షంగా హింట్ ఇస్తున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, దళిత బందు వంటి పథకాలను రద్దు చేస్తామని ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజల పట్ల హస్తం పార్టీ ప్రణాళిక ఎలా ఉందో స్పష్టంగా అర్థమౌతోంది. కర్ణాటకలో మాదిరి సాధ్యం కానీ పథకాలను ప్రకటించి ఓట్లు దండుకొని అలాగే అమలులో ఉన్న పథకాలకు గండి కొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు ప్రజలు స్పష్టంగా అర్థమౌతున్నాయి. ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పడం ఖాయం.

Also Read:కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు!

- Advertisement -