ఇది మా ప్రేమకథ‌..

223
Idhi Maa Prema Katha First Look Poster Release
- Advertisement -

పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం “ఇది మా ప్రేమ కథ”. మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

“ఇది మా ప్రేమ కథ” ఫస్ట్ లుక్ పోస్టర్ ను సెన్నేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నేడు (మార్చి 14) తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ.. “యాంకర్ రవిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ మేం నిర్మిస్తున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ “ఇది మా ప్రేమ కథ” షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.

Idhi Maa Prema Katha First Look Poster Release

ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!!

- Advertisement -