ప్రపంచకప్ లో భాగంగా నిన్న సాయంత్రం జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించదింది. 36పరుగులు తేడాతో ఆసీన్ ను ఓడగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (117; 109 బంతుల్లో 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీనికితోడు విరాట్ కోహ్లి (82; 77 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు), రోహిత్‌శర్మ (57; 70 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్), హార్దిక్ పాండ్య (48; 27 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 5 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించారు ఇండియా బౌలర్లు. నిర్ణిత 50ఓవర్లలో 316 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (69; 70 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సు), డేవిడ్ వార్నర్( 56; 84 బంతుల్లో, 5 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (42; 39 బంతుల్లో, 4 ఫోర్లు,1 సిక్సు), చివర్లో అలెక్స్ కెరె (55; 35 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సు) పోరాడిన ఫలితం లేకపోయింది. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ 3వికెట్లు, చాహల్ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ధానవ్ కైవసం చేసుకున్నాడు.