ఐసీసీ ర్యాంకింగ్స్‌…అగ్రస్ధానంలో భారత్

99
virat
- Advertisement -

ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్ధానంలో నిలిచింది టీమిండియా. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ అగ్రస్ధానంలోకి వెళ్లింది. 269 పాయింట్లతో ఇంగ్లాండ్‌ను దాటి తొలి స్ధానంలో నిలవగా ఆరేళ్ల తర్వాత టీ 20 ర్యాంకుల్లో అగ్రస్ధానంలో నిలవడం విశేషం.

గురువారం నుంచి స్వదేశంలోనే శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.

ఇక కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ (65), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో భారత్ 184/5 స్కోరు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 167/9 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది.

- Advertisement -