టెస్టు ఛాంపియన్‌ షిప్‌ రూల్స్‌ చేంజ్!

119
icc

టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ని చేంజ్ చేసింది ఐసీసీ. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ కోసం కొత్త నియ‌మావ‌ళిని తీసుకురానున్నట్లు ఐసీసీ తెలిపింది. ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ఆయా జ‌ట్ల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది.

తాజా ప్ర‌తిపాద‌న‌నలతో భార‌త్ రెండ‌వ స్థానానికి ప‌డిపోయింది. ఆస్ట్రేలియా 82.22 శాతం పాయింట్ల‌తో మొద‌టిస్థానంలో ఉండగా భారత్ (75) పాయింట్లతో రెండ‌వ స్థానంలో, ఇంగ్లండ్‌(60.83) మూడ‌వ స్థానంలో ఉన్నాయి.

వ‌చ్చే ఏడాది జూన్‌లో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. 27 సిరీస్‌ల‌తో మొత్తం 71 మ్యాచ్‌లు నిర్వ‌హించనుండగా రెండేళ్ల‌లో చాంపియ‌న్‌షిప్‌ను పూర్తి చేయ‌నున్నారు.