ఐసీసీ కొత్త నిబంధన..!

221
icc

కరోనా నేపథ్యంలో ఐసీసీ పలు మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల క్రికెట్ బోర్డులు ప్రేక్షకులు లేకుండానే క్రికెట్‌ను కొనసాగించేందుకు అంగీకారం తెలపగా తాజాగా ఐసీసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

ఇప్పటివరకు మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతి మెరుస్తుండటానికి దాని పై ఆటగాళ్లు లాలాజలం లేదా చెమట ఉపయోగించేవారు. అయితే ఇకనుండి బంతిపై లాలాజలం వాడకాన్ని నిషేధించింది ఐసీసీ.

కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అయితే ఈ నిబంధనను ఎంతమంది ఆటగాళ్లు పాటిస్తారో వేచిచూడాలి.