బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఆరోజే..

103
bb4

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసమయంలో స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 20వ తారీకు ఆదివారం నాడు షో ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుందని అంటున్నారు.

ఇప్పటికే నిర్వాహ‌కులు అందుకు సంబంధించి ప్లాన్ చేస్తుండ‌గా,ఈ ఫినాలేకు బ‌డా స్టార్‌నే గెస్ట్‌గా తీసుకురానున్నార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. గ‌త సీజ‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై త‌న చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్‌కు ట్రోఫీ అందించారు. కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది స‌భ్యులు ఉండ‌గా, వారిలో సోహెల్ లేదా అభిజీత్‌ల‌లో ఒకరు విన్న‌ర్‌గా నిలుస్తార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి.మరి ఎవరు టైటిల్ గెలుచుకుంటారో వేచిచూడాలి.