- Advertisement -
తెలంగాణ ఆడబిడ్డ,ఐఏఎస్ ఆఫీసర్ జల్లి కీర్తి తన పనితీరుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అస్సాంలోని కచార్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న ఆమె.. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలకు ఆసరాగా నిలిచారు.
స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ..ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటు వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండానే మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు.
ఆమె చేస్తున్న సేవలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారగా అందరూ ఆమెను అభినందిస్తున్నారు. గతంలోనూ తన పనితీరుతో ఆకట్టుకున్నారు కీర్తి. ముఖ్యంగా తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఆమె చేసిన కృషికి అవార్డు సైతం లభించింది.
- Advertisement -