ఆమె వెరీ వెరీ స్పెషల్.. ఐఏఎస్ అధికారి… సామాన్యులకు అతి చేరువలో ఉంటారు. నిత్యం అందుబాటులో ఉంటారు. చదివిన చదువు వేరైనా కేవలం సమాజ సేవ కోసమే సివిల్ సర్వీసులోకొచ్చారు. కాస్త డైనమిజం.. కొంత మోడ్రనిటీ.. మరికొంత వైవిధ్యం అన్నీ కలగలిపి తనదైన స్టైల్లో పరిపాలిస్తున్నారు. అందుకే ఆమె ఆల్ రౌండర్ అయ్యారు. ఆవిడే కలెక్టర్ అమ్రాపాలి. ఆమె యువతకు ప్రేరణ.. సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఒక రోల్ మాడల్. చూడడానికి సెలబ్రిటీలా ఉన్నా సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు.
యంగ్ అండ్ డైన్ మిక్ లేడి అయినా అమ్రాపాలి వరంగల్ అర్బన్ కలెక్టర్ గా తనదైన శైలితో పనిచేసి అక్కడి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ అక్కడి వారందరితో కలిసి వరంగల్ జిల్లాను అభివృద్ధిపధంలో నడిపించారు. అయితే ఇప్పుడు వరంగల్ అర్బన్ కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసింది. ఆమెను జీహెచ్‌ఎంసీ అదనపు కమీషనర్‌గా నియమించింది. పాలనలో తనదైన మార్కును చూపించే అమ్రాపాలి హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అదనపు కమీషనర్‌గా ఎటువంటి పనితీరును కనబరుస్తుందో చూడాలి.