నెహ్రుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

243
subramanya swamy

బీజేపీ నేత,ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుపై సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రు తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకొన్నారని ఆరోపించారు.

1950లో రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను యూరప్‌లో ఉన్న భార్య కోసం ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని సమకూర్చాలని నెహ్రు కోరాడని అయితే దానిని ఆయన నిరాకరించినట్టుగా గుర్తు చేశారు. దీంతో ఆయనను ఆ స్థానం నుండి బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకొన్నారని నెహ్రుపై ఆరోపణలు గుప్పించారు.

రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని మోడీ విమర్శలు గుప్పించిన కొద్దిగంటలకే సుబ్రమణ్య స్వామి ఆరోపణలు గుప్పించడం ప్రాధాన్యతం సంతరించుకుంది.