ఉప్పొంగిన అభిమానం.. కేసీఆర్‌కే ఓటేస్తా…

425
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే అభ్యర్థులంతా తమ తమ ప్రచారాల్లో బిజీ అయిపోయారు. ఊరువాడల్లో ప్రచారం చేస్తూ గల్లీలన్నీ కలియతిరుగుతున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. ప్రచారాలు చేస్తున్న అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం
పడుతున్నారు. కారు గుర్తుకే తమ ఓటు అంటూ స్వచ్చందంగా చెప్తున్నారు. గతంలో ఎన్నడు జరగని అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో చేసి చూపించిందని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌నే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని సామూహిక ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అలుపెరగని ఉద్యమం చేసి, తెలంగాణను తెచ్చిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని.. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని.. అన్ని
రంగాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ వృద్దురాలు సీఎం కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. కేసీఆర్‌కే తన ఓటు అని స్పష్టం చేసింది. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీల నేతలు డబ్బులు, బంగారం ఇచ్చినా.. వారికి తాను వేయబోనని.. కేసీఆర్ సార్‌కే తాను ఓటు వేస్తానని తేల్చి చెప్పింది. ఇక తాను మాట తప్పితే.. నాలుక కోసుకుంటానని వ్యాఖ్యానించింది. పుట్టిన పిల్లల నుంచి వృద్దుల వరకు కేసీఆర్ ఆదుకుంటున్నారని స్పష్టం చేసింది. దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఆ వృద్దురాలు స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ దేవుడని వ్యాఖ్యానించింది.

- Advertisement -