- Advertisement -
భారత్‌లో క్రికెట్‌ని ఓ మతంలా చూస్తారని తెలిపారు విండీస్ స్టార్ ఆల్ రౌండర్ బ్రాత్ వైట్. 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నాలుగు సిక్సర్లు కొట్టిన తర్వాత విమానాశ్రాయంలో తనని మరో క్రిస్ గేల్‌లా చేశారని చెప్పారు.
ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడేందుకు భారత్‌కిరాగా.. తనని ఓ హీరోలా నన్ను ట్రీట్ చేస్తూ ఘన స్వాగతం పలికారని వెల్లడించాడు బ్రాత్ వైట్.
ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో కార్లోస్ బ్రాత్‌వైట్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అయితే తాను తప్పకుండా ఐపీఎల్ ఆడతానని చెప్పుకొచ్చాడు. లేదంటే కామెంట్రీ అయినా ఇస్తానని తెలిపాడు.
- Advertisement -