తెలుగు సినిమాలంటే చాలా ఇష్టంః రకుల్

418
rakul
- Advertisement -

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈమూవీ విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న రకుల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తనకు తెలుగు సినిమా షూటింగ్ లు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. వేరే భాషల్లో కంటే తెలుగులో నటిస్తేనే తనకు హాయిగా ఉంటుంది. నేను వివిధ భాషల్లో నటిస్తున్నప్పటికీ తెలుగులో చేయడమంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, తెలుగు సినిమాల షూటింగులు పక్కాగా, పంక్చువాలిటీతో జరుగుతాయి.

అదే హిందీ సినిమా అయితే, ఓ వేళాపాళా వుండదు.  ఉదయం ప్రారంభమవడమే ఆలస్యంగా మొదలవుతుంది. రాత్రి తొమ్మిదింటి వరకు షూటింగ్  జరుగుతూనే వుంటుంది. దాంతో ఇంటికి వెళ్లేటప్పటికి అలసిపోతాం. అందుకే తెలుగు సినిమా షూటింగ్ అంటేనే నాకు హాయిగా వుంటుంది’ అని చెప్పింది. ఈమధ్య తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలు రాకపోవడంతో చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది.

- Advertisement -