శ్రీముఖిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ తల్లి

444
bb3-rahul-sipligunj
- Advertisement -

రియాల్టీ షో బిగ్ బాస్ 3 బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. 105రోజులు సాగిన ఈషో టైటిల్ ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సొంతం చేసుకున్నారు. యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల చెక్, ట్రోఫీని అందుకున్నారు రాహుల్. ఈసందర్భంగా రాహుల్ తల్లి మీడియాతో మాట్లాడుతూ శ్రీముఖిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రాహుల్ బిగ్ బాస్ కప్ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బిగ్ బాస్ టైటిల్ కోసం రాహుల్, శ్రీముఖి మధ్య గట్టి పోటీ నెలకొందని, కానీ రాహుల్ మాటల్లో నిజాయతీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారని సుధారాణి అభిప్రాయపడ్డారు. శ్రీముఖి కూడా చాలా కష్టపడినట్లు తెలిపింది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అందరిలో శ్రీముఖి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. శ్రీముకి ఏం చేసినా అందంగా ఉంటుందని తెలిపింది.

- Advertisement -