సాగరకన్య చాలా తప్పులే చేసిందట..

213
I have made lot of mistakes in my career: Shilpa Shetty
- Advertisement -

‘సాహసవీరుడు సాగరకన్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి. అయితే ఈ అమ్మడి డ్రెస్సింగ్‌ స్టైల్‌ మాత్రం అదుర్స్‌ అనిపిస్తుంది. కొత్త కొత్త వస్త్రాలు, అలంకరణతో ట్రెండ్‌ సెట్టర్‌గా ప్రత్యేక ముద్ర వేసుకుంది ఈ సాగరకన్య.

ఇదిలా ఉంటే.. ముంబైలో జ‌రిగిన ‘ఐసీడ‌బ్ల్యూ 2017’ వేడుక‌లో డిజైన‌ర్ మోనీషా జైసింగ్ రూపొందించిన దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది ఈ పొడుగుకాళ్ల సుంద‌రి.

I have made lot of mistakes in my career: Shilpa Shetty

ఈ సందర్భంగా శిల్పా తన స్టైల్‌ గురించి మాట్లాడుతూ.. చాలా తప్పులు చేశానని, వాటి నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ‘‘స్టైల్‌ అనేది వ్యక్తిగతానికి సంబంధించింది. అనుభవం అనేది కొనుగోలు చేయలేనిది. నా కెరీర్‌లో చాలా తప్పులు చేశా. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. అలా నేర్చుకోవ‌డం నాకిష్టం` అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఏదైనా స‌రే త‌ను కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తాన‌ని, అందులో భాగంగా త‌లెత్తే త‌ప్పుల వ‌ల్ల కొత్త విష‌యాలు నేర్చుకుంటాన‌ని శిల్పా తెలియజేసింది. త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లుగా ఎప్ప‌టికప్పుడు కొత్త దుస్తులు రూపొందించి ఇవ్వ‌డంలో త‌న డిజైన‌ర్ మోనీషా అన్ని ర‌కాల స‌హ‌క‌రిస్తార‌ని శిల్పా చెప్పింది.

- Advertisement -