- Advertisement -
మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు హీరో రాజశేఖర్. మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన గొడవ ఉదంతంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజశేఖర్…ఈ గొడవను పెద్దది చేయొద్దన్నారు.
తన వల్ల జరిగిన గొడవకు క్షమాపణలు చెబుతున్నానని …తనకు, చిరంజీవికి, మోహన్‌బాబుకి మధ్య ఎలాంటి గొడవలు కానీ, అపోహలు కానీ లేవని స్పష్టం చేశారు. గురువారం ఏం జరిగినా అది తనకు, నరేశ్‌కు మధ్య మాత్రమే జరిగినదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.
తన పదవికి రాజీనామా చేశానని, పరిశ్రమకు తన వంతు సాయం ఏది అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిరంజీవి, మోహన్‌బాబుపై తనకు అమితమైన గౌరవం ఉందని, వారి సేవలు ‘మా’ కు అవసరం అన్నారు.
- Advertisement -