హైదరాబాద్ శివారులో దారుణం..

207
Hyderabad woman
- Advertisement -

గోకార్టింగ్ ప్లే జోన్‌లో యువతి మృతి చెందింది. హైదరాబాద్‌లోని గుర్రంగూడలో గోకార్టింగ్ చేస్తుండ‌గా ఓ యువ‌తి త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు విడిచింది. వ‌న‌స్థ‌లిపురంలోని ఎఫ్‌సీఐ కాల‌నీకి చెందిన శ్రీ వ‌ర్షిణి అనే యువ‌తి నిన్న సాయంత్రం త‌న స్నేహితుల‌తో క‌లిసి గోకార్టింగ్ చేసేందుకు గుర్రంగూడ వెళ్లింది.గోకార్టింగ్ చేస్తుండ‌గా ఆమె వెంట్రుక‌లు వెనుక టైరులో చిక్కుకోవ‌డంతో కింద ప‌డిపోయింది.

వ‌ర్షిణి త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో ఎల్బీన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.చికిత్స పొందుతూ గురువారం మ‌ధ్యాహ్నం శ్రీవ‌ర్షిణి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఇంజినీరింగ్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతోంది.మృతురాలి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. గోకార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు.నిర్వాహకులపై మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లిదండ్రులు.

- Advertisement -