సామాన్యురాలి ట్వీట్‌కు స్పందించిన ఎంపీ సంతోష్‌..

212
mp santhosh

ఈరోజు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఎఫ్ సిఐ కాలనీ ఫేస్ 2 నందు ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్న విషయాన్ని ఆ కాలనీవాసురాలు అయిన సురభి మేట్ పల్లి మొదటగా అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తు అందరిచేత మన్ననలు పొందుతు స్వతహాగా పకృతి ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకపోతే తప్పకుండా ఫలితం ఉంటుంది అన్న నమ్మకంతో ట్విట్టర్ వేదికగా చెట్లను నరికి వేస్తున్న వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోష్ దృష్టికి తీసుకు పోవడం జరిగింది.

ఏదైతే నమ్మకంతో ఆమె ట్విట్టర్ చేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తక్షణమే స్పందించిన రాజ్యసభ సభ్యులు సంతోష్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తీసుకుపోయి తక్షణమే చెట్ల నరికివేతను ఆపుచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ ట్విట్టర్ పోస్టింగ్ ని పురస్కరించుకొని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ఎల్బినగర్ జోనల్ కమిషనర్‌ను ఆదేశించగా, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి చెట్లు నరికి వేస్తున్న ప్రదేశానికి వెళ్లి, చెట్లను నరికివేతను ఆపించి దానికి బాధ్యులైన రమేష్ బాబుకి 25 వేల రూపాయల జరిమానా విధించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది.

తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను చెప్పిన విషయానికి తక్షణమే స్పందించి చెట్ల నరికివేత ఆపివేయడమే కాకుండా వారికి జరిమానా విధించే విధంగా చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి తక్షణ స్పందనకు ఫిర్యాదు దారులు సురభి మెట్ పల్లి అదేవిధంగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.