ఆరోగ్య శ్రీ లోకి మరిన్ని సేవలు- మంత్రి ఈటెల

358
Minister Etela Rajender
- Advertisement -

న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయింది ఈ సమావేశం ముగిసింది.ఈ స‌మావేశంలో మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు కేబినెట్ స‌బ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. ఈ నివేదిక‌ను సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అంద‌జేయ‌నున్నారు. ఆరోగ్యశాఖను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

భేటీ అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో, ఆరోగ్య శాఖలో మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకొంది. కోవిడ్ నేపథ్యంలో ఏడు నెలల నుంచి వైద్య శాఖలో పని చేసిన ప్రతి ఒక్కరిని ఉపసంఘం అభినందించింది. తెలంగాణ వైద్య శాఖ దేశంలో మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో బాలింతల మరణాల రేటు తగ్గిందని మంత్రి తెలిపారు.

వైద్య శాఖపై ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఉపసంఘం ఇవ్వనుంది. సబ్ సెంటర్ల స్తానంలో వెల్ నెస్ సెంటర్ల బలోపేతం చేయనున్నాం.ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు సమకూర్చుకోవాలి.అవయవ మార్పిడి కోసం సర్కార్‌లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.పట్టణ ప్రాంతాల్లో హెల్త్ సెంట్రర్లతో పాటు బస్తి దవాఖానలు ప్రారంభించాం. డయోగ్నోసిస్ సేవలు మరింత అందుబాటులోకి తెస్తున్నాం. ప్రజలు ప్రైవేటు అంబులెన్స్ ల భారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొనున్నాం. ఆరోగ్య శ్రీ కోసం 12 వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. మరోపక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఖర్చు అవుతోంది. ఆయుష్మాన్ భారత్ కంటే, ఆరోగ్య శ్రీ మెరుగ్గా ఉంది మంత్రి పేర్కొన్నారు.

ఆరోగ్య శ్రీ లోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. ఆరోగ్య శ్రీ పై ముఖ్య మంత్రికి ప్రత్యేక నివేదిక ఇవ్వనుంది ఉపసంఘం. తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ రెడి చేస్తాం. తెలంగాణలో 108, 104, 102 సర్వీసులకు.. ప్రభుత్వమే నిధులు ఖర్చు పెడుతోంది. పేద ప్రజలు కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులకు పోయి అప్పుల పాలు అవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగయిన వైద్యం అందుతుంది. అందరూ వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.

- Advertisement -