టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

194
SRH
- Advertisement -

షార్జా వేదికగా ఐపీఎల్‌-13లో మంగళవారం ఉత్కంఠబరితమైన మ్యాచ్‌ జరగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌,ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అభిషేక్‌ శర్మ స్థానంలో ప్రియం గార్గ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్‌ వెల్లడించాడు. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ముంబై కెప్టెన్‌ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. ముంబై పేసర్లు బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్‌ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌ చేరుతుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి.

తుది జట్టు

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (C), వృద్దిమాన్ సాహా (WC), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్.

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (WC), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి.

- Advertisement -