దుబ్బాకలో టిఆర్ఎస్ గెలుపు తథ్యం- మంత్రి హరీష్‌

374
harish rao
- Advertisement -

ఈ రోజు దుబ్బాక ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు జరిగింది. పోలింగ్‌ ముగిసిన సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో కరోనా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఓటు హక్కు ను వినియోగించుకున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికి ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రజాప్రతినిధులకు,టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికి, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ సంయమనంతో వ్యవహరించి సజావుగా జరిపించిన ఎన్నికల సంఘానికి, పోలీస్ సిబ్బంది కి,యావత్ జిల్లా యంత్రాంగానికి అభినందినలు తెలిపారు మంత్రి. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు రాష్ట్రం మరియు జిల్లా నుండి ఇంత కరోనా ఉన్న శ్రమిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేర వేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో మొదటి నుండి చివరి నిమిషం వరకు కూడా బిజెపి గోబెల్స్ , అబద్దపు ప్రచారాలను చేస్తూ వచ్చింది. ఇవ్వందాన్ని ఇచ్చినట్టు.. చేయనిదాన్ని చేసినట్టు వారి ఝటా మాటలతో, కుట్రలతో, అల్లర్లతో డబ్బుల ప్రవాహలు ప్రలోభాలకు తెరలేపారు. చివరి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఒక ఫెక్ న్యూస్‌ను క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి పరాకాష్టకు నిదర్శనం అని నిరూపించుకున్నారు. ఎన్నికల రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో కరెంట్ కట్ చేసి దొంగ ఓట్లు వేస్తారు అని మా పార్టీపై అబద్దపు ప్రచారానికి ఓడి గట్టడం హాస్యాస్పదం అన్నారు మంత్రి హరీష్‌.

అంతేకాదు బీజేపీ గెలిచి పోయింది అని తప్పుడు వాయిస్ కాల్స్ పంపుతు ప్రజల్లో అయోమయంలో పడేసే ప్రయత్నం చేసారు. రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పిసిసి, రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులు మూటలతో వచ్చి ప్రచారం చేసిన ప్రజలు తిప్పికొట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన టిఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుపు తథ్యమన్నారు.పెరిగిన పోలింగ్ శాతం అనుకూలత టిఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం. టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసం. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరించారని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -