రియల్ బూమ్…రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్లో నిధుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1) మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 922 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు రాగా.. ఇందులో 41 శాతం అంటే 384 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ రియాల్టీ రంగంలోకి వచ్చాయని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది.
గతేడాది క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో 21 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది క్యూ1లో 763 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా కష్టకాలంలోనూ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఆసక్తికన బరుస్తున్నారు.ఈ ఏడాది క్యూ1 ముంబైలోకి 193 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 107 మిలియన్ డాలర్లు, పుణేలోకి 7 మిలియన్ డాలర్లు, ఇతర నగరాలన్నీ కలిపి 231 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.