ట్రాఫిక్ జామ్‌లకు ఉద్దేశపూర్వకంగా కారణమైతే కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు. చిన్నచిన్న పొరపాట్ల వల్ల చాలాచోట్ల ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నారు వాహనదారులు. చాలా సందర్భాల్లో వాహనదారులకు అవగాహనలేక తమ వాహనాన్ని యాక్సిడెంట్ జరిగిన చోట నుంచి తీసేస్తే ఇన్సూరెన్స్/ పోలీస్ కేసుకు సమస్య వస్తుందని భావించి రోడ్డు జామ్ అయినా సరే వాహనాలను అక్కడి నుంచి తీయట్లేదు. పోలీసులు వచ్చే వరకు వాహనాలను అలాగే పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్‌లకు కారణమైన వారిపై కేసులు నమోదుచేయడంతో పాటు వాహనాలు ఢీకొట్టుకుని స్వల్పంగా ధ్వంసమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తున్నారు.
()దగ్గరలో ట్రాఫిక్ పోలీసు కనబడితే అతనికి ఫిర్యాదు చేయండి.
()డయల్ 100కు ఫోన్ చేసినా సరైన చిరునామాను చెప్పండి.
చేయకూడని చర్యలు
() వాహనాలు డాష్ ఇచ్చినప్పుడు కొట్లాడుకోవద్దు.
()వాహనాలు రోడ్డు మధ్యలో పెట్టొద్దు.
()ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించొద్దు..
()ఇతర వాహనాలకు ఆటంకం లేకుండా చూడాలి.
()వాహనాలను పక్కకు తీసుకుని స్మార్ట్ ఫోన్‌తో ఫొటోలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.
()సైబరాబాద్ పరిధిలో ఘటన చోటు చేసుకుంటే సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ 040-23002424/వాట్సాప్ 8500411111కు సమాచారం అందించండి. ట్రాఫిక్ అధికారులు వెంటనే స్పందిస్తారు.