హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇండియాలో మార్కెట్ లో అత్యంత ఖరీదైన టాప్ ఎండ్ కార్లలో మెక్ లారెన్ ఒకటి కాగా దేశంలో ఈ కారును సొంతం చేసుకున్న వ్యక్తిగా నసీన్ ఖాన్ నిలిచారు.
రూ.12 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ బ్రాండ్ ‘మెక్‌లారెన్ 765 ఎల్‌టీ’ కారు కొన్నారు. ఇప్పటికే నసీన్ ఖాతాలో రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ కార్, మెర్సిడీజ్- బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టంగ్, లంబోర్గిని అవెంటడార్, లంబోర్గిని ఉరుస్ వంటి కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా మెక్ లారెన్ చేరింది.
వెల్కమ్ హోం మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్. ఎంతో అద్భుతప్రదేశంలో ఈ అందమైన కారును తీసుకుంటున్నాను అని ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద కారుతో దిగిన ఫొటోను నసీర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఈ కారు ప్రత్యేకతలివే…కారు టాప్ ఓపెన్ అయ్యేందుకు 11 సెకన్ల సమయం పడుతుంది. ఈ కారుకు 4.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ కారు ఇంజిన్ 765 పీఎస్, 800 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఇవి కూడా చదవండి..