7 నుండి మెట్రో సర్వీసులు..గైడ్ లైన్స్ ఇవే!

212
hyderabad metro
- Advertisement -

ఈ నెల 7వ తేదీ నుండి హైదరాబాద్ మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లు గాంధీ హాస్పిటల్, భ‌రత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూస‌ఫ్‌గూడ మూసే ఉండనుండగా దశల వారిగా మెట్రో సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

ప్ర‌యాణికులు భౌతిక‌దూరం పాటించేలా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మెట్రో రైళ్ల‌ను డిపోలో శానిటైజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. లిఫ్ట్ బ‌ట‌న్స్‌, ఎస్క‌లేట‌ర్ హాండ్ రైల్స్‌, క‌స్ట‌మ‌ర హ్యాండ్లింగ్ పాయింట్ల‌ను ప్ర‌తీ నాలుగు గంట‌ల‌కు ఓసారి శానిటైజ్ చేస్తామ‌న్నారు.

ఫేజ్‌-1 :
సెప్టెంబ‌ర్ 7వ తేదీ నుండి ప్రారంభం

కారిడార్‌-1(మియాపూర్ నుండి ఎల్బీన‌గ‌ర్‌)

ఉద‌యం 7 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరిగి సాయంత్రం 4 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఫేజ్‌-2 :
సెప్టెంబ‌ర్ 8వ తేదీ నుండి ప్రారంభం

కారిడార్‌-3(నాగోల్ నుండి రాయ‌దుర్గం)

ఉద‌యం 7 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు అదేవిధంగా సాయంత్రం 4 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఫేజ్‌-3 :
సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుండి ప్రారంభం

అన్ని కారిడార్ల‌లో(కారిడార్ 1, కారిడార్ 2, కారిడార్ 3)ల‌లో మెట్రో స‌ర్వీసులు ప‌రుగులు తీయ‌నున్నాయి.ఉద‌యం 7 గంట‌ల నుండి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు స‌ర్వీసులు అందుబాటులో ఉండ‌నున్నాయి.

- Advertisement -