భారీగా తగ్గిన బంగారం ధర..!

410
gold rate
- Advertisement -

బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ.51,240కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.46,950కు చేరింది.

పసిడి ధర కాసింత తగ్గినా వెండి మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.240 పెరిగి రూ.53,150కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.47,850కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గుదలతో రూ.49,050కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరిగి 1818 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్స్‌కు 0.75 శాతం పెరుగుదలతో 20.34 డాలర్లకు చేరింది.

- Advertisement -