దేశంలో అత్యున్నతమైన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ గుర్తు చేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరము ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… ఎస్సార్‌డీపీ ప్రోగ్రామ్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని అన్నారు.
సీఎం ఆలోచనల్లో నుంచి పుట్టిన బంగారుతెలంగాణ సాధించుకున్నామన్నారు. 2014లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్దమానబవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తుందని తెలిపారు. ఒక నగరము విశ్వనగరము కావాలో…అన్ని లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలకు నగర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ అదేశించిన విధంగా నగర అధికారులు జీహెచ్‌ఎంసీ హెచ్‌ఎండీఏ అధికారులు హైదరాబాద్‌ను విశ్వనగరం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. 48కార్యక్రమాల్లో భాగంగా శిల్పా ఫ్లైఓవర్ తో కలిసి 33కార్యక్రమాలను ఆరేళ్లలో పూర్తి చేశామని సగర్వంగా చెబుతున్నానన్నారు. ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ కానీ, పుణేకు వెళ్లినా.. ఇలాంటి అత్యుత్తమ మౌలిక వసతులు భారతదేశంలో ఏ నగరంలో లేవు అని.. మనది మనం కితాబిచ్చుకోవడం కాదు.. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు, జాతీయ ప్రముఖులు చెబుతున్న మాట.
పరిశ్రమలు, ఐటీ రంగం విస్తృతంగా పెరగడంతో ప్రతిఏటా లక్షల మంది హైదరాబాద్‌కు కొత్తగా వచ్చి స్థిరపడుతున్నారు. నగరం నలువైపులా విస్తరిస్తున్నది. పశ్చిమ హైదరాబాదే కాదు.. తూర్పు, ఉత్తరం, దక్షిణం నలువైపులా ఓఆర్‌ఆర్‌లో ఉన్నది అంతా జీహెచ్‌ఎంసీలో కలిసిపోయినట్టుగా విపరీతంగా విస్తరిస్తున్న విషయం అందరికీ తెలుసు. అందుకే ఎస్సార్‌డీపీయే కాదు. ఇందులో 8వేలకోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…
ఎమ్మెల్యేల కొనుగోలు..నిందితుల రిమాండ్ పొడగింపు
అభివృద్ధి చేసి చూపించండి..బీజేపీకి గుత్తా సవాల్