తమన్ మళ్ళీ దొరికేశాడు

165
- Advertisement -

తమన్ నుండి ఓ సాంగ్ రావడమే ఆలస్యం దాన్ని పట్టుకొని ట్రోల్ చేయడానికి రెడీ ఉంటారు కొందరు నెటిజన్లు. తాజాగా వీర సింహా రెడ్డి నుండి తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య రిలీజైంది. ఈ సాంగ్ ఇలా వచ్చిందో లేదో దీన్ని గతంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మా సాంగ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ స్టార్ట్ చేసేశారు. అంతే కాదు తమన్ సాంగ్ లో డాన్స్ చేసిన విజువల్స్ ను జత చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రతీ సాంగ్ లానే జై బాలయ్య సాంగ్ లో కూడా తమన్ స్టెప్స్ వేస్తూ సినిమాకు తగిన గెటప్ వేసుకొని మాస్ గా కనిపించాడు. వైట్ అండ్ వైట్ వేసుకొని మేడలో చెయిన్ తో ఎట్రాక్ట్ చేశాడు. కానీ ట్రోలర్స్ మాత్రం సాంగ్ తో పాటు తమన్ లుక్ ని కూడా కామెడీ చేస్తూ వీడియోలు వదులుతున్నారు. ఇక మరో పక్క బాలయ్య అభిమానులను సైతం సాంగ్ మెప్పించలేకపోయింది. పాత ట్యూన్ తో సాంగ్ కొట్టాడంటూ బాలయ్య అభిమానులు పెదవి విరుస్తున్నారు.

ఏదేమైనా తమన్ కి ట్రోలింగ్ కొత్తేం కాదు. కొన్నేళ్లుగా ఇవన్నీ చూస్తూ తట్టుకోవడం ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా అలవాటైంది. మరి వీర సింహా రెడ్డి సాంగ్ ట్రోలింగ్ ని ఈసారి తమన్ ఎలా తీసుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -