లండన్‌లో ఘనంగా వినాయక చవితి..

13
- Advertisement -

హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 11వ వినాయక చవితి వేడుకలు జరిగాయి.లండన్ కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరం లో గణపతి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్‌ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున రీడింగ్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.

‘గణపతి బప్పా మోరియా’,’జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.సంస్థ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.

6 వ రోజు గణపతి హోమం చేయడం జరిగింది.పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డు ని జీవన్, సుమన్ గోలి, మధు గులాయిగారి కలిసి వేలం పాటలో £1500 పౌండ్స్ కి దక్కించుకోవడం జరిగింది.
అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. అనంతరం థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.

అధ్యక్షుడు అశోక్ దూసరి, జాహ్నవి దుసరి, సతీష్ రెడ్డి, శ్రీకత్ రెడ్డి జింకల, సుస్మిత, శ్రీనివాస, లక్ష్మి, హర్ష రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, సుమన్ గోలి, నీలిమ, మధు గులైగారి, భావన, జీవన్, మమత, మహేందర్, శ్వేతా, అనిల్, మల్ల రెడ్డి, శుశమున, శేఖర్, అనిత, హరి నవాబుపేట్, స్నేహ, వీర్, సృజన, సైది రెడ్డి, హారిక యడవల్లి, అభిలాష్ రావు, సమిత, , సంతోష్, వర్ష, నాగార్జున, అనూష, వేణు, నీలిమ, భాను, శ్రీకాంత్ జెల్ల, శైలజ, పవన్, మాధురి, నరేష్ జక్కుల, శశి దొడ్లే, మౌనిక అవినాష్, ప్రత్యూష, భూషణ్, మధు, శివ సిన్నం, సంజీవ్, నిహారిక, సురేందర్, రూప్, వీణ, శ్రీమన్నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, సంధ్య, సత్యపాల్ రెడ్డి, విద్య, మోహన్ , త్రివేద్, నాగరాజ్త దితరులు పాల్గొన్నారు.

Also Read:బాలయ్య టీడీపీ పరువు తీస్తారా ? నిలబెడతారా?

- Advertisement -