స్కంద కి భారీ స్పందన

18
- Advertisement -

రామ్, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స్కంద‌. ఈ గురువారం స్కంద ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ నిన్న రిలీజ్ ట్రైల‌ర్‌ను లాంచ్ చేయ‌గా, ఈ ట్రైల‌ర్ ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. స్కంద కొత్త ట్రైల‌ర్ ఇప్ప‌టికే 10 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. థ‌మ‌న్ సంగీతంలో వ‌స్తున్న ఈ మూవీలో భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ కు భారీ స్పందన వచ్చింది.

కాబట్టి, ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్కంద మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అందుకే, రామ్ అన్ని భాషల్లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో హీరో రామ్‌ పోతినేని అట్లీ కపుల్ కు థ్యాంక్స్‌ చెప్పారు. ‘స్కంద’ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “అట్లీ దంపతులు నాకు మంచి స్నేహితులు. వాళ్లే నన్ను షారుక్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఇందుకు వాళ్లకు కృతజ్ఞతలు. ఇక షారుక్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలిసినప్పుడు ఎంతో మర్యాదగా వ్యవహరించారు అని రామ్ మాట్లాడారు.

Also Read:బాలయ్య టీడీపీ పరువు తీస్తారా ? నిలబెడతారా?

రామ్ ఇంకా మాట్లాడుతూ.. ‘షారుఖ్ – నేను ఇద్దరం సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన ‘స్కంద’ ట్రైలర్‌ పంపమని అడిగారు. హిందీలో నా సినిమాలకు మంచి గిరాకీ ఉందని కూడా షారుఖ్ ఖాన్ చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని రామ్‌ చెప్పుకొచ్చాడు. అన్నట్టు స్కంద మాస్ సినిమానే, కానీ కేవ‌లం మాస్ సినిమా మాత్ర‌మే కాద‌ని, ఎన్నో ఎమోష‌న్స్‌తో స్కంద ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంద‌ని రామ్ చెప్పాడు.

Also Read:ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం…పర్యావరణాన్ని కాపాడుదాం

- Advertisement -