సంక్రాంతి పండగ సందడి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. పండుగ కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమైందుకు సిద్ధమవుతున్నారు. స్కూళ్లు కాలేజీలకు సెలవులు దొరకడంతో పట్నంవాసులు పల్లెబాట పట్టారు. ఇందుకోసం సొంతంగా వెహికిల్స్ బస్సులు రైలలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకోసం తెలంగాణ ఆర్టీసీ మొత్తంగా 4233బస్సులను నడుపుతోంది. కాకపోతే ఈ సారి సాధారణ ఛార్జీతో బస్సులను ఆర్టీసీ నడపనుంది. ముఖ్యంగా బస్సుల్లో అప్‌అండ్ డౌన్ బుకింగ్ చేసుకుంటే సాధారణ ఛార్జీపై 10శాతం రాయితీని ఇవ్వనుంది ఆర్టీసీ.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రైళ్లతో పాటుగా ఆదనంగా 140ట్రైన్‌లను ప్రత్యేకంగా నడపనున్నారు. ఇందులో 94 ప్రత్యేక రైళ్లు మరో 46 ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్టు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ఇందుకునుగుణంగా ప్రత్యేక టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. రైళ్లో ప్రయాణికులకు టికెట్ ఆఫ్‌లైన్ ద్వారా కాకుండా ఆన్‌లైన్ అంటే యూపీఎస్ యాప్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. రైలు బస్సులే కాకుండా ప్రయాణికులు సొంతంగా వాహానాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టోల్‌గేట్ల వద్ద జాతీయ సిబ్బందిని 15 నుంచి 30శాతం పెంచింది.
నల్గొండ జిల్లా చౌటప్పల్‌లోని పతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్ధీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఫాస్టాగ్‌ను 3 సెకన్ల నుంచి 2 సెకన్లకు కుదించారు. దీంతో ట్రాఫిక్ లేకుండా వాహానాలు రయ్..రయ్.. అంటూ పల్లెటూరు బాటకు వెళ్తున్నాయి.
ఇవి కూడా చదవండి…