మండుటెండల్లో మందుబాబులు బీర్లతో ఉపశమనం పొందుతున్నారు. బీర్లు తెగ తాగేస్తున్నారు. మండే ఎండలకు ఇదే ఔషధమని నమ్ముతున్నట్టున్నారు. అందుకే సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు అదిరిపోతున్నాయి. బాటిళ్లకు బాటిళ్లు… కేసులకు కేసులు ఖాళీ అయిపోతున్నాయి.మే నెలలో బీర్ల అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. నువ్వానేనా అంటూ మండే ఎండలతో.. బీర్లు పోటీపడుతున్నాయి. రాష్ట్రంలో పాత రికార్డులను తిరగరాస్తూ.. బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి.
మండుతున్న ఎండలతో.. మద్యం ప్రియులు బీర్లతో కూల్ అవుతున్నారు. రాష్ట్రంలో బీర్లు పొంగి పొర్లుతున్నాయి. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా 40 లక్షలకు పైగా బీర్ కేస్‌లను అమ్మేశారు. ఒక్కో రోజు సుమారు 18 లక్షల బీర్ సీసాలు అమ్ముడయ్యాయంటే బీర్ల అమ్మకాలు ఏ రేంజ్‌లో సాగాయో తెలుసుకోవచ్చు. ఈ ఒక్క నెలలోనే సుమారు రూ.780 కోట్ల మద్యం… రూ.400 కోట్ల బీర్ల అమ్మకాలు సాగించారు.