Tirumala: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

49
- Advertisement -

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 17న అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి.

() సెప్టెంబర్ 17న ఆదివారం – అంకురార్ప‌ణ – రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు.

()18న సోమ‌వారం – బంగారు తిరుచ్చి ఉత్స‌వం – మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు,ధ్వ‌జారోహ‌ణం(మీన ల‌గ్నం) – సాయంత్రం 6.15 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు,
పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు.

()19న మంగ‌ళ‌వారం – చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు,స్న‌ప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు,హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

()20న బుధ‌వారం – సింహ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

()21న – గురువారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

()22న – శుక్ర‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 గంట‌లకు ప్రారంభం.

()23న – శ‌నివారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్వ‌ర్ణ‌ర‌థం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

Also Read:గుడ్డులోని పచ్చసోనా తింటే ప్రమాదమా?

()24న – ఆదివారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

()25న – సోమ‌వారం – ర‌థోత్స‌వం- ఉద‌యం 6.55 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

()26న – మంగ‌ళ‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 3 నుండి 6 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

ధ్వ‌జావ‌రోహ‌ణం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు కార్యక్రమలు జరగనున్నాయి.

Also Read:పిక్ టాక్ : విరహవేదనతో ఎగసిపడిన సోకులు

- Advertisement -