హుజురాబాద్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

141
Election Schedule
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశముల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించకూడదని, నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిత్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని, ప్రింట్ మీడియా లో ప్రచురించరాదని, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేయరాదని, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన, ప్రింటి మీడియాలో ప్రచురించిన, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేసిన ఎన్నికల నిబంధనల మేరకు శిక్షార్హులని ఆయన తెలిపారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది

- Advertisement -