ఐపీఎల్ 2022 వేలంలో అపశ్రుతి.. కుప్ప‌కూలిన ఆక్ష‌నీర్‌..

111
- Advertisement -

బెంగళూరులో నిర్వహిస్తున్న ఐపీఎల్ 2022 వేలంలో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఓ ఆటగాడి రేటు వివరాలు ప్రకటిస్తూ ఉన్నట్టుండి ముందుకు వాలిపోయారు. దాంతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో టీవీ చానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు. ఎడ్మీయడస్‌ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

దాంతో ఐపీఎల్ వేలం అర్థాంతరంగా నిలిచిపోయింది. ఎడ్మీయడస్‌ను నిపుణులైన వైద్య బృందం పరిశీలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కుదుటపడినట్టు సమాచారం. తిరిగి ఐపీఎల్ వేలం ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. అనుకోని ఈ అవాంతరం ఏర్పడిన నేపథ్యంలో, లంచ్ విరామాన్ని కాస్త ముందుగానే ప్రకటించారు.

హ్యూ ఎడ్మీయడస్ బ్రిటన్ జాతీయుడు. 2018 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించగా, మ్యాడ్లీ బ్రిటన్ లో అంపైర్ గా నియమితుడు కావడంతో, అతడి స్థానంలో ఎడ్మీయడస్ వేలం నిర్వహణ చేపట్టారు. గత కొన్ని సీజన్లుగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా వేలం నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు.

- Advertisement -