టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న స్వామిగౌడ్‌..

522
swamy goud
- Advertisement -

టీఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ధూంధాంగా జరుగుతోంది. లక్ష్యం దిశగా నమోదు ప్రక్రియను పూర్తిచేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అందజేశారు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ,ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రెటరీ గట్టు రామచంద్రరావు , కావేటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఇక కోటీ సభ్యత్వాలే లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ చురుకుగా సభ్యత్వాన్ని చేయిస్తున్నారు. దీంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లోనూ సభ్యత్వ నమోదు చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఏర్పాట్లుచేశారు. http://enrol.trspartyonline.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించే విధంగా ఏర్పాట్లుచేశారు. ఇక టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందనవస్తోంది.

- Advertisement -